Kakinada fire accident: కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 18 మంది మృతి
కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 18 మంది మృతి చెందినట్లు సమాచారం.
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 18 మంది మృతి
Kakinada districtలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం – జి. మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది.
మందుగుండు సామాగ్రి తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాద సమయంలో సుమారు 20 మంది వరకు కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినట్లు, సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.