Tirumala Teppotsavam: తిరుమల తెప్పోత్సవం రుక్మిణీ సమేత కృష్ణుని దర్శనం

Tirumala Teppotsavam: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

Update: 2026-02-28 07:58 GMT

Tirumala Teppotsavam: తిరుమల తెప్పోత్సవం రుక్మిణీ సమేత కృష్ణుని దర్శనం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు శ్రీవారి పుష్కరిణిలో అలంకరించిన తెప్పపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు.

ముందుగా ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వేదఘోషలు, భజనల మధ్య తెప్పోత్సవం ఘనంగా జరిగింది.

భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు. తిరుమలలో భక్తి వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News