Guntur: ఆడుకుంటూనే అనంత లోకాలకు.. గొంతులో బెలూన్ ఇరుక్కుని చిన్నారి మృతి

Guntur: ఆడుకోవాల్సిన వయసులో ఆ చిన్నారి ఆడుకుంటున్న బెలూనే కాలపాశమైంది.

Update: 2026-03-04 10:26 GMT

Guntur: ఆడుకోవాల్సిన వయసులో ఆ చిన్నారి ఆడుకుంటున్న బెలూనే కాలపాశమైంది. బెలూన్ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక నాలుగేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే..?

పెదకాకానికి చెందిన శిరీష (4) అనే చిన్నారి ఇంట్లో బెలూన్‌తో ఆడుకుంటోంది. ఈ క్రమంలో బెలూన్ ఒక్కసారిగా గొంతులోకి వెళ్లడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళనతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) కి తరలించారు.

కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు..

చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. ఆసుపత్రికి తీసుకురాకముందే మృతి చెందినట్లు ధృవీకరించారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పెదకాకాని గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.

Tags:    

Similar News