ల్యాబ్ టెక్నీషియన్‌కు స్టేట్ లెవల్ అవార్డు.. రవీంద్రభారతిలో సత్కారం!

Karimnagar: కరీంనగర్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ కరుణాకర్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డు. హైదరాబాద్ రవీంద్రభారతిలో పురస్కారం అందజేసిన వైద్య విధాన పరిషత్.

Update: 2026-04-07 11:18 GMT

ల్యాబ్ టెక్నీషియన్‌కు స్టేట్ లెవల్ అవార్డు.. రవీంద్రభారతిలో సత్కారం!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర వైద్య విదాన పరిషత్ ప్రకటించిన అవార్డుల్లో జిల్లాకు చెందిన కరుణాకర్ కి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతిలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అందించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ల్యాబ్ టెక్నీషియన్ కరుణాకర్ ఉత్తమ ఎంప్లాయ్ గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బాధ్యతాయుతంగా పని పట్ల అంకిత భావంతో పనిచేసిన తనకు గుర్తించి ఉత్తమ ఎంప్లాయ్ గా అవార్డు అందించినందుకు వైద్య విధాన పరిషత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన కరుణాకర్ ఆగస్టు 2000 సంవత్సరంలో ఉద్యోగంలో చేరి నిబద్ధతతో పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. గతంలో కూడా జిల్లాస్థాయిలో పలు అవార్డులను అందుకున్నాడు. ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎంప్లాయ్ గా తో పాటు కరీంనగర్ పేరును రాష్ట్రస్థాయిలో నిలిపాడు. అవార్డులతో పాటు తనపై బాధ్యతలు కూడా పెరిగాయని ఒక ఉత్తమ ఎంప్లాయ్ గా అవార్డు అందుకోవడం తన పనితనానికి నిదర్శనమని తెలిపారు.

Tags:    

Similar News