Adilabad: యుద్ధ ప్రభావం పత్తి మార్కెట్‌లో పెరిగిన ముడి సరుకు డిమాండ్

Adilabad: పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి ధరలు పరుగులు పెడుతున్నాయి.

Update: 2026-04-09 08:55 GMT

Adilabad: యుద్ధ ప్రభావం పత్తి మార్కెట్‌లో పెరిగిన ముడి సరుకు డిమాండ్

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ధరలు పరుగులు పెడుతున్నాయి.. పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం కారణంగా పత్తి ఉత్పత్తులకు విదేశాల నుండి ఎగుమతులు దిగుమతులు జరగక పోవడంతో దేశంలోని స్పిన్నింగ్ మిల్లులో దారం తయారీకి అవసరం అయ్యే ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా పత్తి ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి.. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలకు 8120 రూపాయలుండగా వివిధ మార్కెట్లో 8500 నుంచి 9000 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి.. కాగా గత వానకాలం సీజన్ లో భారత కాటన్ కార్పొరేషన్ పలు రాష్ట్రాల్లో మెజార్టీ సెంటర్లలో పత్తి కొనుగోలు జరిపాయి. పత్తి పంట ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన కారణంగా మూడు క్వింటల్ల 56 కిలోల బేలు క్యాండి ధర 62000 వరకు చేరుకోగా బేళ్ల నిల్వ ఉంచిన వారికి లభసాటిగా మారింది.

ఆదిలాబాద్ సెంటర్ లోనే సీసీఐకి తొమ్మిది లక్షల బేళ్లు ఉండగా, దేశం మొత్తం మీద సిసిఐకి కోటి వరకు బెళ్ళ నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది.. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా సీసీఐ వీటిని విక్రయిస్తే ఆ సంస్థకు భారీగా లాభాలు చేకూరే అవకాశం ఉంది.. అదేవిధంగా ప్రైవేట్ వర్తకుల వద్ద ఉన్న పత్తి బెల్స్ కు కూడా భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. వారం పది రోజుల్లో పత్తి పంట ధర పదివేల రూపాయల వరకు చేరుకునే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.. అయితే పెరుగుతున్న ధరలు రైతులకు ఏ మాత్రం లాభం లేకపోగా, వ్యాపారులకు, పత్తి పంట కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలకు వందల కోట్లు వందల కోట్ల రూపాయల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News