Nizamabad: రైతులకు నష్టపరిహారం అందిస్తాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భరోసా
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు.
Nizamabad: రైతులకు నష్టపరిహారం అందిస్తాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భరోసా
నిజామాబాదు జిల్లా: డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామం లో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు నివేదిక తయారు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడాలని అన్నారు. బిజెపి నాయకులు ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో రైతుల పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం 6 నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల గోసపుచ్చుకున్నదని విమర్శించారు. రైతుల శ్రేయస్సుకు బిజెపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీ అరవింద్ జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కు కృషి చేస్తుందన్నారు. నేటి నుంచి జిల్లాలో సుమారు 600 కి పైగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బిజెపి నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని వీలైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు సహాయం చేయించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.