Mamata Banerjee: సొంత ఇల్లు లేదు.. కారు అసలే లేదు! మమతా బెనర్జీ ఆస్తుల అఫిడవిట్‌లో సంచలన నిజాలు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తుల వివరాలు వెల్లడయ్యాయి. తనకు సొంత ఇల్లు, భూమి లేదా కారు లేదని ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Update: 2026-04-09 11:59 GMT

Mamata Banerjee: సొంత ఇల్లు లేదు.. కారు అసలే లేదు! మమతా బెనర్జీ ఆస్తుల అఫిడవిట్‌లో సంచలన నిజాలు

Mamata Banerjee: రాజకీయంలో అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె, నామినేషన్ దాఖలు చేస్తూ సమర్పించిన అఫిడవిట్‌లో తన వ్యక్తిగత ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తనకు సొంత ఇల్లు లేదని, ప్రస్తుతం ఆమె ఉంటున్న కాళీఘాట్‌లోని 30బీ హరీశ్ ఛటర్జీ వీధిలోని నివాసం తన పేరు మీద రిజిస్టర్ కాలేదని తెలిపారు. ఎటువంటి వ్యవసాయ భూమి లేదా ఖాళీ ప్లాట్లు తన పేరుపై లేవని వెల్లడించారు. తనకు కనీసం ఒక వ్యక్తిగత వాహనం (కారు) కూడా లేదని పేర్కొన్నారు.

చరాస్తుల వివరాలు

ఆమె అఫిడవిట్ ప్రకారం తన మొత్తం చరాస్తుల విలువ సుమారు రూ. 15.37 లక్షలు. ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఇవే.. చేతిలో రూ. 75,700 నగదు ఉంది. రెండు బ్యాంకు ఖాతాలు ఉండగా, వ్యక్తిగత ఖాతాలో రూ. 12,36,209 మరియు ఎన్నికల ఖర్చు ఖాతాలో రూ. 40,000 ఉన్నాయి. కేవలం 9.75 గ్రాముల బంగారం మాత్రమే తన వద్ద ఉందని, దీని మార్కెట్ విలువ సుమారు రూ. 1.75 లక్షలుగా పేర్కొన్నారు.

రాయల్టీలు మరియు బ్యాంకు వడ్డీలే తన ప్రాథమిక ఆదాయ వనరులని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తనకు రూ. 40,600 టీడీఎస్ (TDS) రిఫండ్ వచ్చినట్లు కూడా అఫిడవిట్‌లో వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత నిరాడంబరమైన ఆస్తులను కలిగి ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News