PPF Loan: పీపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న ఈ ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా.? ఈజీగా లోన్

PPF Loan: పొదుపు కోసం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను మినహాయింపు, ప్రభుత్వ భద్రత వంటి ప్రయోజనాల వల్ల చాలా మంది ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే పీపీఎఫ్ ఖాతాదారులకు అవసరమైన సమయంలో లోన్ సౌక‌ర్యం కూడా ఉంద‌ని మీకు తెలుసా.?

Update: 2026-04-09 11:19 GMT

PPF Loan

PPF Loan: పొదుపు కోసం భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. దీర్ఘకాలిక పెట్టుబడి, పన్ను మినహాయింపు, ప్రభుత్వ భద్రత వంటి ప్రయోజనాల వల్ల చాలా మంది ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే పీపీఎఫ్ ఖాతాదారులకు అవసరమైన సమయంలో లోన్ సౌక‌ర్యం కూడా ఉంద‌ని మీకు తెలుసా.?

PPF ఖాతాపై లోన్

పీపీఎఫ్ స్కీమ్ ప్రధానంగా 15 సంవత్సరాల లాక్-ఇన్ కాలంతో ఉండే పొదుపు పథకం. సాధారణంగా ఈ కాలం పూర్తయ్యే వరకు మొత్తం డబ్బును తీసుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఖాతాదారులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి పీపీఎఫ్ లోన్ సదుపాయం. ఖాతా ఓపెన్ చేసిన‌ తర్వాత కొన్ని సంవత్సరాల త‌ర్వాత ఇన్వెస్ట‌ర్లు తమ ఖాతాలో ఉన్న మొత్తంపై రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు బ్యాంక్ లోన్‌లకు వెళ్లకుండా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎవరు లోన్ తీసుకోవచ్చు?

పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన వెంటనే రుణం తీసుకోవడం సాధ్యం కాదు. ఖాతా ప్రారంభించిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరవ సంవత్సరం మధ్య మాత్రమే ఈ లోన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఉదాహరణకు, మీరు 2023లో ఖాతా తెరిచినట్లయితే 2025 నుంచి 2028 మధ్యలో రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలం తర్వాత మళ్లీ లోన్ తీసుకునే అవకాశం ఉండదు. అయితే కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది.

ఎంత మొత్తాన్ని రుణంగా పొందవచ్చు?

పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం మొత్తాన్ని రుణంగా తీసుకోవడం సాధ్యం కాదు. ప్రభుత్వ నియమాల ప్రకారం రెండో సంవత్సరం చివరికి ఖాతాలో ఉన్న మొత్తంలో గరిష్టంగా 25 శాతం వరకు మాత్రమే లోన్ పొందవచ్చు. ఈ పరిమితి పెట్టుబడిదారులు అధికంగా డబ్బు తీసుకుని భవిష్యత్ పొదుపు తగ్గిపోకుండా ఉండటానికి ఉద్దేశించారు. అందువ‌ల్ల అవసరానికి సరిపడేంత మొత్తమే తీసుకునే అవకాశం ఉంటుంది.

వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు గడువు

పీపీఎఫ్ లోన్‌పై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి కేవలం 1 శాతం అదనపు వడ్డీ మాత్రమే చెల్లించాలి. తీసుకున్న రుణాన్ని 36 నెలల లోపు తిరిగి చెల్లించాలి. అయితే నిర్ణయించిన గడువులోపు చెల్లించకపోతే వడ్డీ రేటు గణనీయంగా పెరిగి 6 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అందువల్ల గడువు లోపల రుణాన్ని పూర్తి చేయడం చాలా ముఖ్యం.

పీపీఎఫ్ లోన్ ప్రత్యేక ప్రయోజనాలు

పీపీఎఫ్ లోన్‌లో మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, మీరు రుణం తీసుకున్నా కూడా ఖాతాలో ఉన్న మొత్తం మీద సాధారణ వడ్డీ కొనసాగుతుంది. అంటే మీ పొదుపు పెరుగుదల ఆగిపోదు. అత్యవసర పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో నిధులు పొందడం, ప్రభుత్వ భద్రత కలిగిన స్కీమ్‌లో పెట్టుబడి కొనసాగించడం వంటి కారణాల వల్ల పీపీఎఫ్ లోన్ పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా భావిస్తున్నారు. సరైన సమయంలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే ఆర్థికంగా మంచి సహాయం లభిస్తుంది.

Tags:    

Similar News