Improve Credit Score: క్రెడిట్ స్కోర్‌ను సింపుల్‌గా ఎలా పెంచుకోవాలి...నిపుణులు చెబుతున్న సలహాలు ఇవే
Improve Credit Score: ప్రస్తుత ప్రపంచంలో లోన్, క్రెడిట్‌కార్డ్ కావాలన్నా మొదటగా చూసేది క్రెడిట్ స్కోర్. ఈ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి.
Improve Credit Score
Improve Credit Score: ప్రస్తుత ప్రపంచంలో లోన్, క్రెడిట్‌కార్డ్ కావాలన్నా మొదటగా చూసేది క్రెడిట్ స్కోర్. ఈ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి. క్రెడిట్ స్కోర్ సరిగా లేకుంటే రుణాలు పొందటం కష్టం అవుతుంది. అయితే, క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం చాలా కష్టమని చెబుతుంటారు. కానీ, కొన్ని టిప్స్‌ను ఫాలో అయితే ఈ స్కోర్‌ను ఈజీగా పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి బిల్ చెల్లింపు
క్రెడిట్ కార్డు వాడిన తర్వాత బిల్లును గడువు తేదీకి ముందు చెల్లించడం చాలా అవసరం. సాధారణంగా 30 నుంచి 45 రోజుల గడువు ఉంటుంది. ఈ గడువులో పూర్తి బిల్లు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. కానీ చాలామంది “మినిమమ్ డ్యూ” మాత్రమే చెల్లించి వదిలేస్తారు. ఇది తాత్కాలికంగా సహాయపడినా, దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు మీ డ్యూ పదివేలు ఉంటే అందులో మీరు వెయ్యిరూపాయలు మాత్రమే చెల్లిస్తే...మిగిలిన మొత్తంపై వడ్డీ పడుతుంది. ఇది ఇలానే కొనసాగితే స్కోర్ పడిపోతుంది.
క్రెడిట్ యుటిలైజేషన్ – 30% లోపే ఉండాలి
మీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉందన్నది కాకుండా, దానిలో మీరు ఎంత వాడుతున్నారన్నది ముఖ్యమైన విషయం. దీన్నే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) అంటారు. మీకు మొత్తం రూ.2 లక్షల లిమిట్ ఉంటే, రూ.60,000 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. అంటే 30% లోపే వినియోగం ఉండాలి. ఈ పరిమితిని దాటితే, మీరు అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. ఇది మీ స్కోర్‌పై నెగెటివ్ ప్రభావం చూపిస్తుంది.
కొత్త కార్డుల విషయంలో జాగ్రత్త
కొంతమంది తరచుగా కొత్త క్రెడిట్ కార్డులకు అప్లై చేస్తుంటారు. ప్రతి అప్లికేషన్‌పై బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేస్తాయి. దీనిని “హార్డ్ ఎంక్వైరీ” అంటారు. చిన్న వ్యవధిలో ఎక్కువ ఎంక్వైరీలు జరిగితే, మీరు ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఫలితంగా మీ స్కోర్ తగ్గిపోతుంది. అందుకే ఒకసారి కార్డు రాకపోతే కనీసం 6 నెలలు గ్యాప్ ఇవ్వడం మంచిది.
పాత కార్డులు క్లోజ్ చేయొద్దు
మీరు చాలా కాలంగా వాడుతున్న క్రెడిట్ కార్డు మీకు ఒక ఆస్తిలాంటిదే. దీన్నే “క్రెడిట్ ఏజ్” అంటారు. ఉదాహరణకు 5-10 సంవత్సరాలుగా వాడుతున్న కార్డు ఉంటే, అది మీకు మంచి క్రెడిట్ హిస్టరీని ఇస్తుంది. చాలామంది అవసరం లేదని పాత కార్డులను క్లోజ్ చేస్తారు. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే, అలా చేస్తే మీ క్రెడిట్ ఏజ్ తగ్గిపోతుంది. దాంతో స్కోర్ కూడా పడిపోతుంది. సాధారణంగా 750కి పైగా స్కోర్ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా భావిస్తారు. ఈ స్థాయిని చేరుకోవాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు. కేవలం బిల్లులను సమయానికి చెల్లించడం, వినియోగాన్ని నియంత్రించడం, అవసరంలేని అప్లికేషన్లను తగ్గిడం వంటి చిన్న అలవాట్లు చేసుకుంటే చాలు. ఈ నియమాలు పాటిస్తూ క్రెడిట్ కార్డును వినియోగించుకుంటే అది భారంగా కాకుండా ఆర్థిక బలంగా మారుతుంది.