Ice Cube Business Idea: సమ్మర్‌ స్పెషల్‌ బిజినెస్‌... 2 లక్షల పెట్టుబడితో నెలకు 50 వేల సంపాదన

Ice Cube Business Idea: ఏప్రిల్‌ ప్రారంభం నుంచే వేడి తీవ్రత భారీగా పెరిగింది. దీంతో చల్లని నీరు, చల్లని పానియాలకు డిమాండ్‌ అమాంతం పెరిగింది.

Update: 2026-04-08 04:16 GMT

Ice Cube Business Idea: సమ్మర్‌ స్పెషల్‌ బిజినెస్‌... 2 లక్షల పెట్టుబడితో నెలకు 50 వేల సంపాదన

Ice Cube Business: ఏప్రిల్‌ ప్రారంభం నుంచే వేడి తీవ్రత భారీగా పెరిగింది. దీంతో చల్లని నీరు, చల్లని పానియాలకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఈ పరిస్థితిని వ్యాపారంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం 2 లక్షల పెట్టుబడితో ప్రారంభించగలిగే ఐస్‌క్యూబ్‌ ఫ్యాక్టరీ ఇప్పుడు చిన్న వ్యాపారాల్లో అత్యంత లాభదాయకమైన ఎంపికగా మారుతోంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు సులభంగా సంపాదించవచ్చు.

భారీ డిమాండ్‌

ఐస్ క్యూబ్‌లు కేవలం నగరాలకే పరిమితం కావు. చిన్న గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ వీటి అవసరం ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ సెంటర్లు, ఐస్ క్రీమ్ షాపులు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు… ఇలా ఎక్కడ చూసినా ఐస్ వినియోగం ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ మూడు నెలలే వ్యాపారానికి ప్రధాన సీజన్‌గా చెప్పవచ్చు.

చిన్న స్థలంలోనే ప్రారంభం

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద స్థలం అవసరం లేదు. కనీసం 500 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. శుభ్రమైన నీటి వనరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉంటే ఫ్యాక్టరీని సులభంగా నడపవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ వ్యాపారం ప్రారంభిస్తే ఖర్చులు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి.

అవసరమైన పెట్టుబడి

ప్రారంభ దశలో సుమారు రూ. 2 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో డీప్ ఫ్రీజర్ కోసం రూ. 50,000, ఐస్‌ క్యూబ్‌ తయారీ యంత్రానికి రూ. లక్ష, ప్యాకింగ్‌ మెషీన్‌, ఇతర పరికరాల కోసం రూ. 50 వేలు అవసరం అవుతాయి. ఇది చిన్న స్థాయి యూనిట్ కోసం సరిపోతుంది. డిమాండ్ పెరిగేకొద్దీ యంత్రాలను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్, అనుమతులు

వ్యాపారం ప్రారంభించే ముందు స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అదనంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం కూడా మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది.

సరఫరా ఎలా చేయాలి?

ఐస్ క్యూబ్‌లను మీరు స్వయంగా అమ్మడానికి తిరగాల్సిన అవసరం లేదు. మీ ప్రాంతంలోని హోటళ్లు, షాపులు, క్యాటరింగ్ సర్వీసులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే వారు మీ దగ్గరకే వస్తారు. ఒక కిలో ఐస్ క్యూబ్ ధర మార్కెట్‌లో రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. రోజుకు 100–150 కిలోల అమ్మకం జరిగితే మంచి ఆదాయం వస్తుంది.

లాభాల లెక్కలు

ప్రారంభంలో నెలకు రూ. 25,000 నుంచిరూ. 30,000 వరకు సంపాదన సాధ్యమే. కానీ వేసవి పీక్ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ఇది రూ.50,000 వరకు చేరుతుంది. పెళ్లిళ్లు, ఈవెంట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం పొందవచ్చు.

తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు

నీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. హైజీన్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ కస్టమర్లతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉండాలి. కనీసం ఈ ప్రమాణాలను పాటిస్తే బిజినెస్‌ రెగ్యులర్‌గా వస్తుంది. వ్యాపారం విస్తరణకు దోహదపడుతుంది. మొత్తంగా చూసుకుంటే చిన్న పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఐస్ క్యూబ్ వ్యాపారం మంచి అవకాశం. ముఖ్యంగా వేసవి సీజన్‌లో ఇది బంగారు గనిలా మారుతుంది. సరైన ప్రణాళిక, కష్టపడి పని చేస్తే ఈ చిన్న వ్యాపారం పెద్ద ఆదాయానికి మార్గం చూపిస్తుంది.

Tags:    

Similar News