Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు..తులం బంగారం ఎంత ఉందంటే?
Gold Rate Today: హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజూ బంగారం ధరలు భారీగా తగ్గాయి.
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు..తులం బంగారం ఎంత ఉందంటే?
Gold Rate Today: పసిడి ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు, వరుసగా రెండో రోజూ భారీగా దిగివచ్చాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 'వార్నింగ్', మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిణామాలు బులియన్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి.
ట్రంప్ వార్నింగ్.. మారిన సమీకరణాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని, లేదంటే భీకర దాడులు తప్పవని స్పష్టం చేశారు. ఈ పరిణామంతో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ, ఇన్వెస్టర్లు అప్రమత్తమవ్వడంతో బంగారం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి.మరోవైపు, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య 14 రోజుల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందన్న వార్తలు గ్లోబల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు పెరిగినప్పటికీ, దేశీయంగా మాత్రం ధరలు తగ్గడం గమనార్హం.
హైదరాబాద్‌లో నేటి ధరలు..
భాగ్యనగరంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. ఒక్కసారి ధరలను పరిశీలిస్తే..
24 క్యారెట్ల బంగారం (తులం): నిన్నటితో పోలిస్తే రూ. 820 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,49,840 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల బంగారం (తులం): రూ. 750 మేర దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,37,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధర కూడా విలవిల.
బంగారంతో పాటే వెండి కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 మేర కోత పడింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2,55,000 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది.