Saving scheme: ప్రతీ నెల మీ ఖాతాలోకి రూ. 10 వేలు.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Saving scheme: ప్రస్తుత కాలంలో ఖర్చులు పెరుగుతున్న పరిస్థితుల్లో చాలా మంది భద్రత ఉన్న పెట్టుబడుల కోసం చూస్తున్నారు.
Saving scheme
Saving scheme: ప్రస్తుత కాలంలో ఖర్చులు పెరుగుతున్న పరిస్థితుల్లో చాలా మంది భద్రత ఉన్న పెట్టుబడుల కోసం చూస్తున్నారు. పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ప్రతి నెలా కొంత ఆదాయం వస్తే ఇంకా మంచిదని భావిస్తారు. అలాంటి వారికి పోస్టాఫీస్ అందిస్తోన్న పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి.
జాయింట్ ఖాతా అవకాశం
ఈ పథకంలో పర్సనల్ ఖాతా తెరవచ్చు. అలాగే భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ప్రారంభించవచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ జాయింట్ అకౌంట్ తీసుకుంటే మొత్తం రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెడితే వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో కుటుంబ ఖర్చులకు ఉపయోగపడే నెలవారీ ఆదాయం లభిస్తుంది.
వడ్డీ రేటు ఎలా ఉంటుంది.?
ప్రస్తుతం ఈ పథకంపై పోస్ట్ ఆఫీస్ ఏటా 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. ఒకవేళ భార్యాభర్తలు కలిసి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే వారికి సంవత్సరానికి సుమారు రూ.1,11,000 వరకు వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని నెలల వారీగా చూస్తే ప్రతి నెలా దాదాపు రూ.9,250 వరకు మీ సేవింగ్స్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ ఆదాయం మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా క్రమంగా అందుతుంది. అందుకే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఈ స్కీమ్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
ఐదేళ్ల తర్వాత అసలు పెట్టుబడి సురక్షితం
ఈ పథకానికి మొత్తం 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో డబ్బు పొందుతారు. ఈ కాలంలో మొత్తం వడ్డీగా సుమారు రూ.5 లక్షలకుపైగా ఆదాయం రావచ్చు. ముఖ్యంగా కాలపరిమితి పూర్తయ్యాక మీరు పెట్టిన అసలు పెట్టుబడి మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
ఎవరు అర్హులు.?
ఈ పథకంలో చేరడం చాలా సులభం. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఖాతా ప్రారంభించవచ్చు.
ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే చాలు. ఈ వివరాలు సమర్పించిన తర్వాత ఖాతా ప్రారంభించి పెట్టుబడి పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకం కావడంతో డబ్బు భద్రత విషయంలో ఎలాంటి భయం ఉండదు. నెలనెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇది మంచి పెట్టుబడి మార్గంగా చెప్పవచ్చు.