New Income Tax Rules: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ఇక ఫామ్ 16 కనిపించదు

New Income Tax Rules: 2026 ఏప్రిల్ నుంచి ఆదాయపు పన్ను శాఖలో భారీ మార్పులు జరిగాయి.

Update: 2026-04-06 04:45 GMT

New Income Tax Rules: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ఇక ఫామ్ 16 కనిపించదు

Tax Act 2026: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు 2026 ఏప్రిల్ 1 నుంచి చారిత్రాత్మక మార్పుగా నిలిచిపోనుంది. దశాబ్దాల కాలం నాటి పాత చట్టాలకు స్వస్తి పలికి, కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువుల నుండి ఫామ్‌ల పేర్ల వరకు అన్నీ మారిపోయాయి. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూనే, నిబంధనలను కఠినతరం చేసింది ప్రభుత్వం. ఈ ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను నియమావళి 2026 ప్రకారం ప్రధాన మార్పులు ఇవే:

ఐటీఆర్ ఫైలింగ్ గడువులో మార్పు

సాధారణంగా ప్రతి ఏటా జూలై 31 నాటికి అందరూ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు వర్గాల వారీగా గడువులను మార్చారు. గతంలో జూలై 31 ఉండగా, ఇప్పుడు వీరికి ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు.జీతం పొందే ఉద్యోగులు యథావిధిగా జూలై 31 లోపే ఫైల్ చేయాలి. ఆడిట్ అవసరమైన వారు అక్టోబర్ 31 వరకు సమయం తీసుకోవచ్చు.

తప్పులు సరిదిద్దుకోవడానికి 12 నెలల ఛాన్స్

ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత ఏవైనా పొరపాట్లు గుర్తిస్తే, వాటిని సరిచేసుకునేందుకు ఇచ్చే సమయాన్ని 9 నెలల నుండి 12 నెలలకు పెంచారు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. 9 నెలల తర్వాత రివైజ్ చేస్తే పెనాల్టీ చెల్లించాలి. ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే రూ. 1,000, పైన ఉంటే రూ. 5,000 జరిమానా పడుతుంది.

రిటర్న్స్‌లో వెసులుబాటు

గతంలో అప్‌డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు నష్టాల విషయంలో కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ నిబంధనలను సడలించారు. మీ అప్‌డేటెడ్ రిటర్న్ ద్వారా మునుపటి నష్టాలు తగ్గుతున్నట్లయితే, ధైర్యంగా ఐటీఆర్ యూ దాఖలు చేయవచ్చు. దీనివల్ల అండర్ రిపోర్టింగ్ పెనాల్టీల నుండి తప్పించుకోవచ్చు.

రూ. 2 లక్షల దాటితే పాన్ ఉండాల్సిందే

ఇకపై కేవలం ఆఫీసు పనులకే కాదు, వ్యక్తిగత విలాసాలకు కూడా పాన్ తప్పనిసరి. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగలు కొన్నా లేదా ఇతర ఖరీదైన వస్తువుల లావాదేవీలు చేసినా పాన్ నంబర్ ఇవ్వడం ప్రభుత్వం కంపల్సరీ చేసింది. దీనివల్ల పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా పెరుగుతుంది.

పాత ఫామ్‌లకు కొత్త పేర్లు

కొత్త చట్టానికి అనుగుణంగా ఫామ్‌ల పేర్లు మరియు నంబర్లను పూర్తిగా మార్చేశారు. ఫామ్ 16 (జీతం వివరాలు).. ఇకపై ఇది ఫామ్ 130గా మారింది. ఫామ్ 26AS (పన్ను క్రెడిట్) ..ఇది ఫామ్ 168గా మారింది. ఫామ్ 15G/15H.. ఈ రెండింటినీ కలిపి ఒకే ఫామ్, ఫామ్ 121గా మార్చారు. ఐటీఆర్-1 (సహజ్).. ఒక ఇంటికి బదులు ఇప్పుడు రెండు ఇళ్ల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా ఇందులో చూపించవచ్చు.

ఈ మార్పులన్నీ పన్ను చెల్లింపుదారుల సౌకర్యం కోసమే అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గడువు దాటితే పడే పెనాల్టీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫామ్ నంబర్ల మార్పును గమనించి, మీ ట్యాక్స్ కన్సల్టెంట్‌ను సంప్రదించి ఫైలింగ్ పూర్తి చేయడం ఉత్తమం.

Tags:    

Similar News