RBI Monetary Policy 2026: సామాన్యులకు ఊరట.. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన..!

RBI Monetary Policy 2026: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన 2026-27 తొలి ద్వైమాసిక సమీక్షలో కీలక నిర్ణయం. రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

Update: 2026-04-08 05:01 GMT

RBI Monetary Policy 2026: సామాన్యులకు ఊరట.. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన..!

RBI Monetary Policy 2026: దేశీయ ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా 5.25 శాతం వద్దే స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

వరుసగా రెండోసారి స్థిరంగా..

గత ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలోనూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. ఇప్పుడు మరోసారి అదే నిర్ణయాన్ని రిపీట్ చేసింది. అయితే గతేడాది (2025) గణాంకాలను పరిశీలిస్తే, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్‌లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు, ఆపై డిసెంబరులో మరో పావు శాతం కోత విధించింది. ఫలితంగా గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గింది.

దీని ప్రభావం ఏమిటి?

రెపో రేటులో మార్పు లేకపోవడంతో బ్యాంకులు ఇచ్చే హోమ్ లోన్లు, కార్ లోన్లు మరియు ఇతర వ్యక్తిగత రుణాల ఈఎంఐ (EMI) లపై తక్షణ భారం పడదు. డిపాజిటర్లకు కూడా పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News