Palakonda: సీతంపేటలో పశువుల పంపిణీ.. గిరిజన రైతులకు ఎమ్మెల్యే జయకృష్ణ భరోసా

Palakonda: సీతంపేట గిరిజన రైతులకు రూ. 2.24 కోట్ల పాడి పశువుల సాయం. 250 ఆవులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మరియు పీఓ స్వప్నిల్ పవర్.

Update: 2026-04-09 12:13 GMT

Palakonda: సీతంపేటలో పశువుల పంపిణీ.. గిరిజన రైతులకు ఎమ్మెల్యే జయకృష్ణ భరోసా

పార్వతీపురం మన్యం జిల్లా: సీతంపేట మండలం చిన్నబగ్గ గ్రామంలో ITDA (పశు సంవర్ధక శాఖా)కు సంబందించి పశు వైద్య శిభిరం మరియు మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమం లో పాలకొండ నియోజకవర్గం శాసన సభ్యులు నిమ్మక జయక్రిష్ణ , ఐటీడీఏ పి.ఓ స్వప్నిల్ పవర్ తో కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పాడి పశువులను గిరిజన రైతులకు పంపిణీ చేసారు. సుమారు 250 ఆవులను ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అందజేశారు. అదే విధంగా 460 పాడి పశువులు కొనుగోలు చేసిన 2,24,25000/- చెక్కు ను కూడా లబ్దిదారులకు అందచేశారు. ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన సీతంపేటలో ఐటీడీఏ ద్వారా మంచి కార్యక్రమం చేపట్టారని, పాడి పరిశ్రమ ద్వారా గిరిజన రైతులకు ఆర్థిక చేయూత లభించే విధంగా ఈ పశువుల పంపిణి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.

Similar News