Siddipet: రాజక్కపేటలో భూభారతి సర్వే.. సమస్యల పరిష్కారమే లక్ష్యం
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో భూభారతి రీ-సర్వేపై అవగాహన కార్యక్రమం.
Siddipet: రాజక్కపేటలో భూభారతి సర్వే.. సమస్యల పరిష్కారమే లక్ష్యం
Siddipet: భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామంలో సర్పంచ్ పద్మా వెంకటేష్ ఆధ్వర్యంలో భూభారతి భూ సర్వే, రీ సర్వే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. గ్రామంలో ఉన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. రైతుకు రికార్డుల్లో ఉన్న ప్రకారం భూమి యొక్క హద్దులను కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఉండేందుకు ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేకు సహకరించాలని కోరారు. అనంతరం సర్వే పై తలెత్తిన పలు సమస్యలను అధికారులు నివృత్తి చేశారు.