KKR vs LSG: ఈడెన్ గార్డెన్స్‌లో ఆసక్తికర పోరు.. కోల్‌కతాలో కీలక మార్పులు, తుది జట్లు ఇవే!
KKR vs LSG IPL 2026 Playing 11: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.
KKR vs LSG: ఈడెన్ గార్డెన్స్‌లో ఆసక్తికర పోరు.. కోల్‌కతాలో కీలక మార్పులు, తుది జట్లు ఇవే!
KKR vs LSG IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను పరిశీలించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని భావించినట్లు తెలిపాడు. కోల్‌కతాలో కీలక మార్పులు జరిగాయి. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలానే కెమెరాన్ గ్రీన్ ఈరోజు బౌలింగ్ చేస్తున్నట్లు కేకేఆర్ కెప్టెన్ రహానే చెప్పాడు.
లక్నో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఓ విజయం సాధించింది. ప్రస్తుతం ఎల్ఎస్‌జీ ఖాతాలో 2 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండింట్లో ఓటమి పాలై, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో కేకేఆర్ ఖాతాలో కేవలం 1 పాయింట్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగుపడాలని కేకేఆర్ ఆశిస్తోంది.
టాస్ అనంతరం రిషభ్ పంత్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. మా బౌలర్లపై పూర్తి నమ్మకం ఉంది. వారు ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు పరిమితం చేస్తారని నమ్మకంగా ఉన్నాం. జట్టులో ఎలాంటి మార్పులు లేవు' అని తెలిపాడు. కోల్‌కతా కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. 'మేము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్‌నే ఎంచుకునే వాళ్లం. గత మ్యాచ్ రద్దయింది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. జట్టులో ఒక మార్పు చేశాం. సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి గాయంతో కోలుకుంటున్నాడు' అని వెల్లడించాడు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, అంగ్ర్కిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైని, కార్తిక్ త్యాగి.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు: మనీశ్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐదెన్ మార్‌క్రమ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, మహమ్మద్ షమి, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు: ఆయుష్ బదోని, మాథ్యూ బ్రీట్జ్కే, షహబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, హిమ్మత్ సింగ్.