DC vs GT: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే, ఆ ఇంపాక్ట్ ప్లేయర్ మరోసారి మెరిసేనా!
DC vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
DC vs GT: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే, ఆ ఇంపాక్ట్ ప్లేయర్ మరోసారి మెరిసేనా!
DC vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల రెండు మ్యాచ్‌లలో చేజింగ్‌లో విజయం సాధించడంతో అదే వ్యూహాన్ని కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. జట్టులో ఎలాంటి మార్పులు లేవని అక్షర్ చెప్పాడు. ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు గుజరాత్ సారథి గిల్ చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ మరోసారి ఆడనున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచులలో రెచ్చిపోయిన రిజ్వీ.. గుజరాత్‌పై కూడా చెలరేగడానికి సిద్దమయ్యాడు.
టాస్ అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. 'ఇది కొత్త పిచ్. వర్షం కారణంగా కొంత తేమ ఉండే అవకాశం ఉంది. అందుకే ముందుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు పరిమితం చేసి లక్ష్యాన్ని చేజ్ చేయాలని భావిస్తున్నాం. జట్టులో ఎలాంటి మార్పులు లేవు' అని తెలిపాడు. గిల్ మాట్లాడుతూ... 'మేము కూడా టాస్ గెలిచినా బ్యాటింగ్‌నే ఎంచుకునే వాళ్ళం. వాతావరణ పరిస్థితుల కరంగా రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఉండదు. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఓపెనింగ్‌లో సాయి సుదర్శన్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని భావిస్తున్నాం. గత మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ మెరుగుపరచుకోవాలని చూస్తున్నాం' అని చెప్పాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాథుమ్ నిశాంక, నితీశ్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్‌దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి.నజరాజన్, ముఖేశ్ కుమార్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు:
ఢిల్లీ: అశుతోష్ శర్మ, అకిబ్ నబీ దార్, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్.
గుజరాత్: ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్, మానవ్ సుతార్, జయంత్ యాదవ్, అనుజ్ రావత్.