DC vs GT: దంచి కొట్టిన బట్లర్, గిల్, సుందర్.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!

DC vs GT: ఐపీఎల్‌ 2026లో భాగంగాఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది.

Update: 2026-04-08 16:12 GMT

DC vs GT: దంచి కొట్టిన బట్లర్, గిల్, సుందర్.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!

DC vs GT: ఐపీఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించి.. ఢిల్లీ మూడు భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన గుజరాత్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ పరుగులు సాధించారు. గుజరాత్ బ్యాటరల్లో కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (70; 45 బంతుల్లో 4×4, 5×6), జోస్ బట్లర్ (52; 27 బంతుల్లో 3×4, 5×6), వాషింగ్టన్‌ సుందర్‌ (55; 32 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీలు బాదారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్స్ పడగొట్టాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెనర్ సాయి సుదర్శన్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతంగా ఆడాడు. మరోవైపు వికెట్‌ కీపర్ జోస్ బట్లర్ వేగంగా పరుగులు బాదాడు. గిల్ 45 బంతుల్లో 70 పరుగులు చేయగా.. బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. బట్లర్ అనంతరం వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడు. 32 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (14*), రాహుల్ తేవాతియా (1*) నాటౌట్‌గా నిలిచారు.

ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నప్పటికీ.. ఎక్కువ పరుగులు ఇచ్చాడు. లుంగి ఎంగిడి, కుల్‌దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఎంగిడి (24) ఎక్కువ పరుగులు ఇవ్వకుండా గుజరాత్ బ్యాటర్ల దూకుడును అడ్డుకున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న కుల్‌దీప్ 42 రన్స్ సమర్పించుకున్నాడు. మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలింగ్ బలహీనంగా ఉండటంతో గుజరాత్ భారీ స్కోరు నమోదు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదిస్తుందో లేదో చూడాలి. ఢిల్లీలో స్టార్ బ్యాటర్లు ఉండడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా సాగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News