Karimnagar: ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ.. నేతల నివాళి
Karimnagar: కరీంనగర్ సదాశివపల్లి చౌరస్తాలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ.
Karimnagar: ముద్దసాని దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ.. నేతల నివాళి
కరీంనగర్ జిల్లా: మాజీ మంత్రి, దివంగనేత ముద్దసాని దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్, కరీంనగర్ కార్పోరేషన్ చైర్మన్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్లు సత్తు మల్లేశం,హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ ప్రణవ్ బాబుతో కలిసి కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలోని సదాశివపల్లి చౌరస్తాలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు.
అనంతరం అల్గునూర్ లోని ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన సమావేశంలో దామోదర్ రెడ్డి అభిమానుల సమంక్షంలో నేతలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణారావు మాట్లాడుతూ తెలుగుదేశం రాష్ర్ట నాయకత్వంలో పదవులు అనుభవించి ఉమ్మడి జిల్లాలో కమలాపూర్ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి రాష్ర్టంలో మాజీ మంత్రిగా పని చేసిన నేత దామోదర్ రెడ్డి శిష్యులుగా పని చేసి ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారని, అందులో తాను ఒక్కడినని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం అభిమానులుగా తాము కృషి చేస్తూ ఆయన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.వచ్చే ఏడాదిలోగా హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ ప్రణవ్ బాబు సహకారంతో జమ్మికుంటలో దామోదర్ రెడ్డి విగ్రహాన్ని మరొకటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ నాయకుడిగా జిల్లాను దామోదర్ రెడ్డి శాషించినారని తెలిపారు. ఆయన మార్గదర్శకులుగా ఉంటాడని, అందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయన చేసిన అభివృద్ది హుజురాబాద్ లో కనిపిస్తుందని, ఆయన కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, ఉన్న నాయకులను కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లినారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ కార్పోరేషన్ చైర్మన్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్లు సత్తు మల్లేశం, అన్నయ్య, హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ ప్రణవ్ బాబుతో విధ పార్టీల నాయకులు ఆకుల నర్సయ్య, బండారి రమేష్, రావుల రమేష్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, కంది అశోక్ రెడ్డి, బండి మల్లేశం, దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.