Karimnagar: కరీంనగర్‌లో సంక్షేమ జాతర దివ్యాంగులకు వాహనాల పంపిణీ!
Karimnagar: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ.
Karimnagar: కరీంనగర్‌లో సంక్షేమ జాతర దివ్యాంగులకు వాహనాల పంపిణీ!
కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో మహిళలు పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధులు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గంగుల కమలాకర్ తో కలిసి అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్స్ ను అందించారు. ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించేందుకు మొబైల్స్ ఫోన్స్ అందించడం సంతోషమన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన మరొక కార్యక్రమంలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.