Nizamabad: రుద్రూర్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ఆర్ఐ శశాంక్

Nizamabad: రుద్రూర్ మండల కేంద్రంలో కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబానికి ఎన్ఆర్ఐ శశాంక్ ఆర్థిక సాయం.

Update: 2026-04-09 14:13 GMT

Nizamabad: రుద్రూర్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ఆర్ఐ శశాంక్

Rudrur: రుద్రూర్ మండల కేంద్రంలో కుటుంబ పెద్దన కోల్పోయిన బాధితురాలికి ఎన్ఆర్ఐ శశాంక్ చేయూతనందించారు. గురువారం బాధ్యత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతోపాటు గజానన్ కుటుంబానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాలను, అభాగ్యులను ఆదుకునే దిశలో కోనేరు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా కోనేరు ట్రస్ట్ ముందు సాగుతుందని నిరుపేదలు అభాగ్యులను గుర్తించడంలో తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. చదువుపై మక్కువ ఉండి ఉన్నత చదువులు చదివే స్తోమత లేని వారికి సైతం తాము ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఆయన వెంట బిజెపి రుదురు మండల అధ్యక్షులు హరి కృష్ణ, బిజెపి కౌన్సిల్ సభ్యులు ప్రశాంత్ గౌడ్, మాజీ విండో డైరెక్టర్ ఏమ్ల గజేందర్, మండల ప్రచార కార్యదర్శి కుమ్మరి గణేష్ ఉన్నారు.

Tags:    

Similar News