Kurnool: పీలేరు లాయర్ హత్య ఆలూరులో న్యాయవాదుల నిరసన!

Kurnool: పీలేరులో న్యాయవాది హత్యపై కర్నూలు జిల్లా ఆలూరులో లాయర్ల ఆగ్రహం. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన.

Update: 2026-04-09 14:01 GMT

Kurnool: పీలేరు లాయర్ హత్య ఆలూరులో న్యాయవాదుల నిరసన!

కర్నూలు జిల్లా: ఆలూరులో నిరసన పీలేరు బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదిపై దుండగులు ఇంటి వద్దే దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై న్యాయవాదుల్లో తీవ్ర ఆగ్రహం.

ఈ ఘటనను ఖండిస్తూ ఆలూరు బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం నిరసన చేపట్టారు.

అంబేద్కర్ సర్కిల్ వద్ద చేరుకున్న న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

న్యాయవాదుల భద్రతకు హామీ ఇవ్వాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు న్యాయవాది విజయం వెంకటేశ్వర, ఆలూరు బార్ అసోసియేషన్ సభ్యుడు షాకీర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags:    

Similar News