Wanaparthy: పొగరులేటి.. నీ అవినీతి చిట్టా బయటపెడతాం - హరీష్ రావు హెచ్చరిక!
Wanaparthy: వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఘాటు విమర్శలు.
Wanaparthy: పొగరులేటి.. నీ అవినీతి చిట్టా బయటపెడతాం - హరీష్ రావు హెచ్చరిక!
వనపర్తి జిల్లా: రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ప్రెస్ మీట్..
మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్..
అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి మాటలు విన్నాం..
సెక్రటేరియట్ లో అబద్ధాలు మాత్రమే మాట్లాడారు..
ఆయన భూతులు మాట్లాడుతుంటే ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది.
సరుకు లేనపుడు,సమాధానం లేనపుడు తిట్లు వెతుక్కుంటారు..
ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా.. రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడారు.
పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకున్నాడు..
నేనొక్కన్నె అవినీతి పరుడున్ని కాదు.. అందరూ మంత్రులు అవినీతి పరులే అని తేల్చారు..
రాష్ట్రంలో అవినీతి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారు..
ఆయనతో పాటు అందరిని కలుపుకున్నాడు.
పొంగు లూటీ అని ఆయనే చెప్పకనే చెప్పిండు..
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.. రాఘవ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతి మా అధికారులే గుర్తు పట్టారు.. ఫైన్ కూడా కట్టారని సీఎం చెప్పారు..
అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారు..
నాలుగు శాఖల అధికారులు మైనింగ్ ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించారు..
పొంగులేటి చెప్పింది తప్పా.. అధికారులు చెప్పింది తప్పా..
ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా?
నువ్వేమో సంబంధం లేదని చెప్తున్నావ్.
పొగరులేటి నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్ని బయటపెడతాం..
రాఘవ కు మైనింగ్ లేదని ఎందుకు లేదని చెప్పలేదు..
అసెంబ్లీ లో ఉండి కూడా నాది కాదని చెప్పలేదు..
కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది.. కాంగ్రెస్ జెండా ఎందుకు ఉంది?
పిసిబి, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న కాపీ నేను అసెంబ్లీ లో చూపెట్టాను..
బాంబులేటి బుకాయిస్తున్నావ్.. వాస్తవాలు అసెంబ్లీ లో ఎందుకు చెప్పలేదు..
నాదార్ గుల్ భూములు కాపాడింది బీ ఆర్ఎస్ పార్టీ..
హై కోర్ట్ లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడింది..
సీలింగ్ భూములు అమ్మినవారి మీద.. కొన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ తెచ్చింది బీఆర్ఎస్..
ప్రభుత్వ భూములు అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుంది..
రెండున్నర ఏండ్లుగా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు..
శిల్ప తో రాఘవ కంపెనీకి సంబంధాలు ఉన్నాయా లేవా?
ప్రభుత్వ భూములు అయితే హైడ్రా గడ్డి పీకుతుందా?
అక్రమణదారులపై చర్యలు తీసుకోండి..
నీ బాంబులు అన్ని తుస్సుమన్నాయి..
ముఖ్యమంత్రి అసెంబ్లీ లో అబద్దం ఆడారు అని చెప్పాలి.