Vizag: కేజీహెచ్‌లో నర్సుపై దాడి.. విధులను బహిష్కరించిన సిబ్బంది
Vizag: విశాఖ కేజీహెచ్‌లో కాంట్రాక్ట్ నర్సుపై వార్డ్ బాయ్ దాడికి నిరసనగా సిబ్బంది విధులు బహిష్కరించారు.
Vizag: కేజీహెచ్‌లో నర్సుపై దాడి.. విధులను బహిష్కరించిన సిబ్బంది
విశాఖపట్నం: కేజీహెచ్ రాజేంద్ర ప్రసాద్ వార్డ్ లో కాంట్రాక్టు నర్సు మీద వార్డ్ బాయ్ దాడికి నిరసనగా గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. వీరికి ఏపీ నర్సుల సంఘం జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ స్వయంగా వార్డులో విచారణ చేసి కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్ నర్సులు తమ విధుల్లోకి చేరాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ నర్సులు మీడియాతో మాట్లాడుతూ.... కేజీహెచ్ లో పనిచేస్తున్న తమకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నర్సులపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ నర్సులు పాల్గొన్నారు.