Mahabubabad: పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు.. ఏప్రిల్ 16 ఆఖరి తేదీ

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఏప్రిల్ 16 వరకు పొడిగించారు.

Update: 2026-04-09 10:27 GMT

Mahabubabad: పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడిగింపు.. ఏప్రిల్ 16 ఆఖరి తేదీ

మహబూబాబాద్ జిల్లా: ఎస్సి కార్పొరేషన్ ద్వారా పాడి గేదెల పథకానికి గాను ఆన్ లైన్ దరఖాస్తు గడువు తేది: 16-04-2026 వరకు పొడిగింపు..

జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లి, మహబూబాబాద్ జిల్లా ద్వారా 2025-26 సం. నకు పాడి గేదెల పథకానికి గాను ఆన్ లైన్ దరఖాస్తు తేది 08-04-2026 ముగియడంతో ప్రభుత్వం గడువు తేదిని 16-04-2026 వరకు పొడిగించనైనదని కార్యనిర్వాహక సంచాలకులు శ్రీ కె. శ్రీనివాసరావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. కావున, అర్హులైన షెడ్యూల్డ్ కులములకు చెందిన యువతీ/యువకులు సంబందిత కుల దృవీకరణ పత్రం (తెలంగాణా ఏర్పడిన తరవాత జారీ చేసింది), ఆదాయ దృవీకరణ ప(తం (మీసేవ ద్వారా జారీ చేసింది), ఆదార్ కార్డు, రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు, పాస్ పోర్ట్ సైజు పోటో, సదరం సర్టిఫికేట్ (వికలాంగుల కోసం) మరియు పట్టాదారు పాసు పుస్తకం (కనీసం 0.10 గుంటలు), తదితర దృవ ప(తాలతో 16-04-2026 వరకు ఆన్ లైన్ (www.tgobmms.cgg.gov.in) నందు దరఖాస్తు చేసుకొని, వెంటనే అట్టి ఆన్లైన్ దరఖాస్తుకు సంబందిత దృవ పత్రాలను జత పరిచి (హార్డ్ కాపీ), గ్రామీణ ప్రాంతం వారు సంబందిత MPDO కార్యాలయము నందు మరియు పట్టణ ప్రాంతం వారు సంబందిత మునిసిపాలిటి కార్యాలయము నందు సమర్పించవలసినదిగా తెలియపరచనైనది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు (02) పాడి గేదెలను అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా అధికారి పేర్కొన్నారు.

Tags:    

Similar News