OTT: మొండెం లేని తల మిస్టరీ.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ వెబ్‌ సిరీస్

OTT: మొండెం లేని తల మిస్టరీ.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ వెబ్‌ సిరీస్

Update: 2026-04-09 10:12 GMT

 OTT

OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో క్రైమ్ థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ ల‌భిస్తోంది. మిస్టరీ, సస్పెన్స్ కలిసిన కథలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. తాజాగా అలాంటి మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ కాట్టాన్‌ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.

ఏడు భాషల్లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే చాలా సిరీస్‌లు ఒకే భాషలో కాకుండా పలు భాషల్లో అందుబాటులోకి వస్తున్నాయి. అదే విధంగా ‘కాట్టాన్’ వెబ్ సిరీస్ కూడా ఒరిజినల్‌గా తమిళ్‌లో రూపొందింది. అయితే ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలని భావించి దీనిని ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను ఆస్వాదించే అవకాశం దక్కింది.

కథలో ప్రధాన మిస్టరీ ఏంటి?

ఈ సిరీస్ కథ ఒక విచిత్రమైన హత్య కేసుతో ప్రారంభమవుతుంది. చాలా కాలంగా పెద్దగా కేసులు లేని కారణంగా ఒక చిన్న పోలీస్ స్టేషన్‌ను మూసివేయాలని అధికారులు భావిస్తారు. అయితే ఆ సమయంలోనే ఒక కొండ ప్రాంతంలో మొండెం లేకుండా తెగిపోయిన ఒక తల పోలీసులకు కనిపిస్తుంది. ఆ తల ఎవరిది? మిగతా శరీరం ఎక్కడుంది? అతన్ని ఎవరు హత్య చేశారు? అనే ప్రశ్నలు పోలీసుల ముందుకు వస్తాయి. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు.

దర్యాప్తు సాగుతున్న కొద్దీ మృతుడి గతం గురించి ఒక్కో విషయం బయటపడుతుంది. అతను గతంలో వాచ్ మెకానిక్‌గా పని చేశాడని, ఏనుగులను శిక్షణ ఇచ్చే ట్రైనర్‌గా ఉన్నాడని, తర్వాత అక్రమ కార్యకలాపాల్లో చిక్కుకున్న బాడీగార్డ్‌గా కూడా పనిచేశాడని పోలీసులు తెలుసుకుంటారు. ఈ నేపథ్యం మొత్తం కేసును మరింత క్లిష్టంగా మార్చుతుంది.

ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి న‌టించారు. తన ప్రత్యేక నటనతో ఆయన పాత్రకు మరింత బలం చేకూర్చారు. ఈ వెబ్ సిరీస్‌ను రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు మణికందన్ తెరకెక్కించారు. ఆయన కథను సస్పెన్స్‌తో ముందుకు తీసుకెళ్లారు. ఈ సిరీస్‌లో విజయ్ సేతుపతితో పాటు మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, ముత్తు కుమార్, సింగం పులి, బాలాజీ, వడివేలు మురుగన్, రిషా జాకబ్స్, వీజే పారు, కళైవాణి భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రల్లో న‌టించారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తొలి సీజన్‌లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉన్నాయి. మిస్టరీ కథలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే సిరీస్‌లను ఇష్టపడే వారికి ‘కాట్టాన్’ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Tags:    

Similar News