OTT Movies: ఈ వారం వినోదాల విందు.. ఓటీటీలో 14 కొత్త సినిమాలు
OTT Movies: ఓటీటీలో 'ద బాయ్స్ 5', 'తాయ్ కిళవి' వంటి 14 కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.
OTT Movies
OTT Release: వేసవి సెలవులు మొదలవుతున్న వేళ, ప్రేక్షకులను అలరించేందుకు టాలీవుడ్ బాక్సాఫీస్ సిద్ధమైంది. ఈ వారం థియేటర్లలో క్రేజీ ప్రాజెక్టులు పోటీ పడుతుండగా, ఓటీటీలో ఏకంగా 14 కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి.
థియేటర్లలో శేష్ మార్క్ యాక్షన్
ఈ వారం అందరి కళ్లు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ పైనే ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షానిల్ డియో దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ప్రకాష్ రాజ్, సునీల్, అనురాగ్ కశ్యప్ వంటి హేమాహేమీలు ఉండటంతో ఈ 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
ఇక అదే రోజున..లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) సినిమా కూడా విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ వినూత్న రామ్-కామ్ చిత్రం యువతను ఆకట్టుకోనుంది. ఎస్.జె. సూర్య కామెడీ అదనపు ఆకర్షణ. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పళ్లిచట్టంబి' కూడా ఏప్రిల్ 10నే థియేటర్లలోకి రానుంది.
ఓటీటీలో కొత్త కంటెంట్ జాతర
థియేటర్లకు వెళ్లలేని వారి కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ 14 కొత్త ఆప్షన్లను సిద్ధం చేశాయి. యాక్షన్, మిస్టరీ, రొమాన్స్.. ఇలా అన్ని జానర్లలోనూ కంటెంట్ అందుబాటులో ఉంది.
Amazon Prime: సూపర్ హీరోల వెర్రి వేషాల నేపథ్యంలో సాగే 'ద బాయ్స్ సీజన్ 5' పాపులర్ సిరీస్ ఏప్రిల్ 8 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
Netflix: అవార్డ్ విన్నింగ్ సిరీస్ సెకండ్ పార్ట్ "బీఫ్ సీజన్ 2" ఏప్రిల్ 8 నుంచి అందుబాటులోకి వస్తోంది.
OTT: రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన "తాయ్ కిళవి" చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ZEE5: ఆసక్తికరమైన తమిళ సిరీస్ "ఖాకీ సర్కస్" ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తు యా మై, క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్, హాళ్, కనిమంగళం కొవిలకమ్, బిగ్ మిస్టేక్స్, 18th రోజ్, త్రాష్, వైల్డ్ క్యాట్, ఔట్‌కమ్ వంటి సినిమాలు పలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి.