OTT: సీరియల్ కిల్లింగ్ మూవీస్ ఇష్టపడేవారు ఈ సినిమా కచ్చితంగా చూడాలి.. ఏ ఓటీటీలో ఉందంటే.
OTT: థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా సైకో కిల్లర్, క్రైమ్, రొమాన్స్ కలిసిన కథలైతే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇలాంటి ఓ సినిమానే “కిల్లర్ ఆర్టిస్ట్”. ఈ సినిమా కథేంటి.? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
OTT: సీరియల్ కిల్లింగ్ మూవీస్ ఇష్టపడేవారు ఈ సినిమా కచ్చితంగా చూడాలి.. ఏ ఓటీటీలో ఉందంటే.
OTT: థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా సైకో కిల్లర్, క్రైమ్, రొమాన్స్ కలిసిన కథలైతే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇలాంటి ఓ సినిమానే “కిల్లర్ ఆర్టిస్ట్”. ఈ సినిమా కథేంటి.? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
‘కిల్లర్ ఆర్టిస్ట్’
సంతోష్ కల్వచర్ల, క్రిషికా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన “కిల్లర్ ఆర్టిస్ట్” సినిమా గతేడాది విడుదలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోని ఈ చిత్రం ఆ తర్వాత ఓటీటీలో సందడి చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.
నటీనటులు, టెక్నికల్ టీమ్
ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకత్వం వహించారు. హీరోగా సంతోష్ కల్వచర్ల నటించగా హీరోయిన్‌గా క్రిషికా పటేల్ కనిపించారు. బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు పొందిన సోనియా ఆకుల కీలక పాత్రలో కనిపిస్తుంది. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి, కాళకేయ ప్రభాకర్, వినయ్ వర్మ, సత్యం రాజేష్, స్నేహ మాధురి, సుదర్శ తదితరులు కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారు.
కథలో ప్రధాన ట్విస్ట్
ఈ సినిమా కథ మొత్తం నగరంలో జరుగుతున్న వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. విక్కీ (సంతోష్) తన చెల్లెలు స్వాతిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇద్దరూ కలిసి ప్రశాంతంగా జీవితం గడుపుతుంటారు. కానీ ఒక రోజు వారి ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు స్వాతిని హత్య చేస్తారు. తన కళ్ల ముందే జరిగిన ఈ సంఘటన విక్కీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన తర్వాత అతను మానసికంగా తీవ్రంగా కుంగిపోతాడు. ఇలాంటి సమయంలో విక్కీ జీవితంలోకి జాను (క్రిషికా పటేల్) వస్తుంది. ఆమెతో పరిచయం అతనికి కొంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇదే సమయంలో నగరంలో మరో భయంకర పరిణామం జరుగుతుంది. ఓ మాస్క్ ధరించిన సైకో కిల్లర్ యువతులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు చేస్తుంటాడు.
సస్పెన్స్ పెంచే మలుపులు
పోలీసులు ఒక దశలో ఆ సైకో కిల్లర్‌ను పట్టుకుంటారు. కానీ అతను ధరించిన మాస్క్ విక్కీ ఇంట్లో కనిపించడంతో, తన చెల్లెల్ని చంపింది కూడా ఇదే వ్యక్తి అనుకుంటాడు విక్కీ. అయితే కథ అక్కడితో ముగియదు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆ కిల్లర్ అనూహ్యంగా జాను బర్త్‌డే పార్టీలో కనిపిస్తాడు. ఆ సమయంలో విక్కీకి నిజం తెలిసి షాక్ అవుతాడు. అసలు నగరంలో జరుగుతున్న హత్యల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? విక్కీ చెల్లెల్ని చంపింది నిజంగా ఆ సైకో కిల్లరేనా? లేక మరెవరైనా? చివరికి తన చెల్లెల్ని చంపిన వ్యక్తిని విక్కీ గుర్తించగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.