Kamareddy: నాణ్యతలో రాజీ పడొద్దు.. కాంట్రాక్టర్లకు కలెక్టర్ సీరియస్ ఆదేశాలు!
Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
Kamareddy: నాణ్యతలో రాజీ పడొద్దు.. కాంట్రాక్టర్లకు కలెక్టర్ సీరియస్ ఆదేశాలు!
Kamareddy: మద్నూర్ (కామారెడ్డి) విద్య రంగంలో కీలక పాత్ర పోషించే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్యా ను అందించాలనే లక్ష్యం తో "యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్" ను నిర్మించి అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని ఈ పాఠశాలల నిర్మాణనికి కావలసిన నిధులను కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
స్కూల్ నిర్మాణం మ్యాప్ ను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్.
జుక్కల్ నియోజక వర్గంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మద్నూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న "యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్"పనులకు సంబంధించిన మ్యాప్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమగ్రంగా పరిశీలించి , పనులను అత్యుత్తమ నాణ్యతతో,వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్ ను స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు.
మద్నూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న "యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్" నిర్మాణపు పనులను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కు డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరస్వర్ సాయిలు, స్థానిక సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, తహసిల్దార్ ముజీబ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ భర్త ఆయిల్వర్ రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పాటిల్ లతోపాటు అధికారులు, నాయకులు ఆత్మీయంగా స్వాగతం పలికి, పుష్ప గుచ్చలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.