Karimnagar: వైట్ ప్లేట్ కార్ల ఇల్లీగల్ దందా.. కుదేలవుతున్న ట్యాక్సీ రంగం!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో వైట్ ప్లేట్ కార్ల అక్రమ రవాణా (ఇల్లీగల్ దందా) వల్ల ట్యాక్సీ క్యాబ్ యజమానులు, డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా ట్యాక్సీ క్యాబ్స్ ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.
Karimnagar: వైట్ ప్లేట్ కార్ల ఇల్లీగల్ దందా.. కుదేలవుతున్న ట్యాక్సీ రంగం!
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ట్యాక్సీ క్యాబ్స్ ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ సమావేశం పద్మ నగర్ మార్కెట్ వద్ద రుద్ర తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పున్నం రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఇల్లీగల్ దందా వైట్ ప్లేట్ కార్లు ద్వారా ట్రిప్పులు కరీంనగర్ టు హైదరాబాద్, వరంగల్ నిజామాబాద్, ఇతర జిల్లాలకు తిరుపతి ,షిరిడి యాత్రలకు వైట్ ప్లేట్ కార్ల ద్వారా కిరాయిలు తిప్పడం వల్ల ట్యాక్సీ క్యాబ్ ఓనర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాబ్ల అనే యాప్ సంస్థ ద్వారా ఇతర రాష్ట్రాల ద్వారా వచ్చి కరీంనగర్ ప్రజలను యాప్ ద్వారా బుక్ చేసుకుని పోవడం వల్ల ట్యాక్సీ క్యాబ్స్ ఓనర్స్ తీవ్రంగా నష్టం జరుగుతుందని, కరీంనగర్ జిల్లాలో వైట్ ప్లేట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కిరాయిలకు తిప్పుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ ద్వారా కూడా ట్యాక్సీ క్యాబ్స్ తీవ్రంగా నష్టపోతున్నారని అట్లాగే వెంకటేశ్వర థియేటర్ బస్టాండ్ ముందు వైట్ ప్లేట్ కార్ల అడ్డాలు తొలగించాలని కోరారు.
వైట్ ప్లేట్ కార్లతో రవాణా శాఖకు ఆర్టీసీకి భారీ నష్టం..
వైట్ ప్లేట్ కార్ల తో కిరాయిలకు తిప్పడం వల్ల రవాణా శాఖ కు ఆర్టీసీకి ఆదాయానికి భారీగా ఆదాయం నష్టం జరుగుతుందని వైట్ ప్లేట్ కార్లపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రైవేటు ట్రావెల్స్ లో కిరాయిల కొరకు టాక్సీ క్యాబ్స్ నే ఉపయోగించాలని అన్నారు. బాబ్ల యాప్ రద్దు చేయాలని, నగరం అభివృద్ధిలో భాగంగా కళాభారతి ముందు ప్రజల అవసరాల రీత్యా టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రభుత్వ ఆఫీసులలో బినామీ పేర్లతో వైట్ ప్లేట్ కార్లు తిప్పుతున్నారు, అట్టి కార్లను తొలగించాలని, ప్రజలు అవసరాల రీత్యా హైదరాబాద్ ఇతర జిల్లాలు మరియు తిరుపతి ,షిరిడి యాత్రలకు టాక్సీ క్యాబ్స్ ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండు ప్రభాకర్, ములుగు వీరాస్వామి ,ఎల్దండి చందు, దొంగల శ్రీనివాస్ యాదవ్, ఆరేపల్లి మల్లేష్ ,బానోతు రాజేష్, శ్రావణ్, వెంగళ లక్ష్మారెడ్డి, కునుసోతు నరేష్, తదితరులు పాల్గొన్నారు.