రైతే నిత్య సైంటిస్ట్.. అవార్డు స్వీకరణలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ సుధాకర్ భావోద్వేగం

Karimnagar: వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకు హెచ్ఎంటీవీ కరీంనగర్ రిపోర్టర్ సుధాకర్‌కు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవార్డును ప్రదానం చేసింది.

Update: 2026-03-28 10:15 GMT

రైతే నిత్య సైంటిస్ట్.. అవార్డు స్వీకరణలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ సుధాకర్ భావోద్వేగం

కరీంనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయానికి సంబంధించిన మంచి కథనాలను ప్రసారం చేసినందుకు హెచ్ఎంటీవీ జర్నలిస్టుకు ఉత్తమ అగ్రికల్చర్ జర్నలిస్టు అవార్డును ప్రధానం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఏరువాక తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం అందించిన వ్యవసాయ సమాచారాన్ని రైతులకు చేరువయ్యే విధంగా కథనాలను హెచ్ఎంటీవీ ద్వారా ప్రసారం చేసినందుకు కరీంనగర్ రిపోర్టర్ సుధాకర్ కు ఈ అవార్డును ప్రధానం చేశారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సమగ్ర యాజమాన్య పద్ధతులపై, రైతులు పండిస్తున్న వివిధ పంటలపై, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నో కథనాలను ప్రచురించి రైతులకు మంచి చేశారన్నారు.

నిత్య సైంటిస్టులు రైతులు..

రైతులు ఎప్పుడూ సైంటిస్టులేనని వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలు సూచించే సూచనలను జర్నలిస్టుగా రైతులకు చేరవేయడం తన కర్తవ్యం అని వృత్తిలో భాగంగా తను చేసిన పనిని అభినందించి సన్మానం చేయడం నాకు మరింత బాధ్యత పెరిగింది అన్నారు. వ్యవసాయ రంగం మీద అనేకమంది ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వ్యవసాయ రంగాన్ని రాబోవు రోజుల్లో సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులు మరింత ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి రైతు తను వేసిన పంటపై ఎప్పుడూ గమనిస్తూనే ఈ సమయంలో ఏది చేయాలి అని ఎప్పటికప్పుడు జాగరుకతో ఉంటాడు. అందుకే రైతులు నిత్య సైంటిస్టులు. 

Tags:    

Similar News