Gangadhara: నిరుపేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల సందడి!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశానికి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి హాజరయ్యారు.

Update: 2026-03-28 08:47 GMT

Gangadhara: నిరుపేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల సందడి!

Gangadhara: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతోందని కరీంనగర్ గంగాధర గ్రామ సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజన్న పేర్కొన్నారు. శనివారం నాడు మండల పరిధిలోని గంగాధర గ్రామంలో ముద్రకోల రాజేశ్వరి - హన్మండ్లు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై వారి ఇంటిలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ:

"దశాబ్దాలుగా గూడు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఈ పథకం ఒక వరం. అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి అని తెలిపారు.తమ సొంతింటి కల నిజం కావడమే కాకుండా, స్వయంగా సర్పంచ్ హాజరై బట్టలు పెట్టి గౌరవించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు..

Tags:    

Similar News