Karimnagar: రేవంత్-కేసీఆర్ ఒక్కటే.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు!

Karimnagar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కయ్యారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

Update: 2026-03-28 05:51 GMT

Karimnagar: రేవంత్-కేసీఆర్ ఒక్కటే.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు!

కరీంనగర్: నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లను కేంద్రం అమలు చేసేందుకు సిద్దమవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో డిప్రెషన్ మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అందుకే ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారని, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం డిజైన్ లోపానికి ప్రధాన బాధ్యత కేసీఆర్ దేనని చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ ను, కాళేశ్వరం అవినీతి పరులను రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేయడం లేదని అన్నారు. కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్కక్కవడంవల్లే కేసీఆర్ కుటుంబంసహా బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారు..

నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లను కేంద్రం అమలు చేస్తుంటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళుతున్నారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిపై దిగజారి మాట్లాడుతున్నారు. సీఎం భాషను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. ఓట్ల కోసం 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలిస్తారు. అధికారంలోకి వచ్చాక గాడిద గుడ్డు చూపిస్తారు. లాగుల తొండలు విడుస్తానని అంటారు. ఇదేందని మేం మాట్లాడితే గుండు, బండి అని మాట్లాడతారే తప్ప ఆ హామీలను అమలు చేయాలనే సోయే ఉండదు.

Tags:    

Similar News