Educational Awards: హెచ్‌ఎంటీవీ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026.. కళాభవన్‌లో సందడి!

Educational Awards: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్‌లో hmtv ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026 వేడుక ఘనంగా జరుగుతోంది.

Update: 2026-03-28 01:46 GMT

Educational Awards: హెచ్‌ఎంటీవీ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026.. కళాభవన్‌లో సందడి!

Educational Awards: హెచ్ఎంటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026ను నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళా భవన్ లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉన్నత విద్య, ఉపాధి కల్పనకు ఊతమిస్తున్న విద్యాసంస్థలను సమున్నతంగా సత్కరించనుంది. తెలుగు రాష్ట్రాలలో చదువును మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాలకు చేరువ చేస్తూ.. ఉన్నతమైన విద్యను అందిస్తున్న విశిష్ట సంస్థలను సన్మానించనుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ బీర్ల ఐరయ్య గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది లబ్ధ ప్రతిష్టులైన విద్యావేత్తలు పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమం రెండు సెషన్స్ గా జరగనుంది. తొలి సెషన్ లో వివిధ రంగాలపై అనుభవజ్ఞులైన వివిధ రంగాల ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.

Tags:    

Similar News