Peddapalli: రామరాజ్య స్థాపనే ప్రభుత్వ లక్ష్యం.. సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే ఆకాంక్ష.

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు.

Update: 2026-03-27 12:51 GMT

Peddapalli: రామరాజ్య స్థాపనే ప్రభుత్వ లక్ష్యం.. సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే ఆకాంక్ష.

Peddapalli: శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివార్లను ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం రామాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గం పాడిపంటలతో తులతూగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నాను.

రామరాజ్య స్థాపన లక్ష్యంగా, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి నా వంతు పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ సర్పంచులు బంగారి రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, నాయకులు సబ్బని రాజమల్లు, మాదాసి సతీష్, అల్లం దేవేందర్, ఎనుగంటి రవి, గోలి సుధాకర్, రామచంద్రం, నరేందర్ రాణవేన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News