Nandipet: ఏకగ్రీవంగా 'నల్ల పోచమ్మ పలుగుట్ట' ఆలయ కమిటీ

Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేటలో నల్ల పోచమ్మ పలుగుట్ట ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Update: 2026-03-27 11:15 GMT

Nandipet: ఏకగ్రీవంగా 'నల్ల పోచమ్మ పలుగుట్ట' ఆలయ కమిటీ

నందిపేట్ న్యూస్: జిల్లా కేంద్ర నందిపేట్ గ్రామ పురాతన నల్ల పోచమ్మ పలుగుట్ట ఆలయ నూతన కమిటీని శ్రీ రామ నవమి పవిత్ర దినాన ఏకగ్రీవంగా నిర్వహించబడినది, గ్రామ అభివృద్ధి కమిటీ ముగ్గురు అధ్యక్షులు సభ్యులు గ్రామ ప్రజల ఏకగ్రీవ తీర్మానంతో నూతన ఆలయ కమిటీ ఎన్నిక జరిగింది.

ఆలయ కమిటీ చైర్మన్ గా మచ్చర్ల సాగర్ , వైస్ చైర్మన్ గా తాటికాయల సుభాష్ , కోశాధికారిగా ఎర్రం ప్రవీణ్ ని, డైరెక్టర్లుగా పండరి రాజు, కుమ్మరి సాగర్ ,ఆర్మూర్ గంగారం, ఎర్రం రాజేందర్, జుంబరి సాగర్, నడికుడ రాజేశ్వర్, ధ్యావతి లింగం, చందన్ గంగాధర్, సుంకరి సురేష్, వాల్గోట్ రాజు, వేముల కుమార్, బుక శ్రీకాంత్, గార్లను ఎన్నుకోవడం జరిగింది.

నూతన కమిటీని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రం భోజేందర్, మంతెన శీను, మంగి ఎల్లయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాల శాలువాతో సన్మానించడం జరిగింది. సనాతన ఆలయ సంరక్షణ, నూతన ఆలయ నిర్మాణం, పలిగుట్ట సంరక్షణ ధ్యేయంగా ఆలయ కమిటీ పనిచేస్తుందని తెలపడం.

Tags:    

Similar News