Dichpally: డిచ్‌పల్లిలో 'దక్షిణ కాశీ' వైభవం.. అట్టహాసంగా సీతారాముల కళ్యాణం!

Dichpally: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పూజల్లో పాల్గొన్నారు.

Update: 2026-03-27 14:08 GMT

Dichpally: డిచ్‌పల్లిలో 'దక్షిణ కాశీ' వైభవం.. అట్టహాసంగా సీతారాముల కళ్యాణం!

Dichpally: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్ పల్లి రామాలయంలో లో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామాలయం లో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు నిర్వహించారు.

శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని కళ్లారా వీక్షించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఖిల్లా డిచ్ పల్లి గ్రామాన్ని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తుందన్నారు.

ఈ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అడిషనల్ డీసీపీ బసవ రెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News