Kondagattu: రామనవమి వేళ భక్తజన సంద్రంగా కొండగట్టు
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Kondagattu: రామనవమి వేళ భక్తజన సంద్రంగా కొండగట్టు
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శ్రీరామనవమి సందర్భంగా భక్తుల రద్దీతో కళకళలాడింది. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేదమంత్రాల నడుమ తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చొప్పదండి నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.