Nandipet: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పై నందిపేట కాంగ్రెస్ కన్నెర్ర!

Nandipet: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇందిరా గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నందిపేటలో కాంగ్రెస్ శ్రేణులు పినాయిల్ బాటిల్స్‌తో నిరసన తెలిపారు.

Update: 2026-03-28 07:34 GMT

Nandipet: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పై నందిపేట కాంగ్రెస్ కన్నెర్ర!

నందిపేట్: నందిపేట్ మండల్ కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద బీజేపీ ఆర్మూర్ MLA రాకేష్ రెడ్డి, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నందిపేట్ లో పినాయిల్ బాటిల్స్ తో నిరసన తెలిపారు. మాజీ ప్రధాని దేశంకోసం ప్రాణాలను అర్పించిన మహనీయురాలు ఇందిరా గాంధీ పేరును ఇప్ప సారా పై పెట్టదు అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు.

మహిళాలను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదన్నారు అన్ని పథకాల పై ఇందిరా గాంధీ ఉందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆమె చేసిన కృషి త్యాగం వల్ల మన దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. రాకేష్ రెడ్డి గుర్తుచేసుకోవాలి మీ బీజేపీ నాయకుడు వాజపేయి ఇందిర గాంధీ ఉక్కు మహిళా, దుర్గా దేవి అని పిలిచారు. ఆర్మూర్ ప్రాంతంలో ఎప్పడు బీజేపీ MLA ఎప్పడు ఏమీ మాట్లాడతారో అని ప్రజలు అనుకుంటున్నారు కావున కాంగ్రెస్ నాయకులు ఈ రోజు MLA నోరు కడగటానికి పినాయిల్ బాటిల్స్ తో నిరసన తెలిపారు ఖబర్దార్ రాకేష్ రెడ్డి మీరు వెంటనే మీడియా ముందుకు వచ్చి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో నాయకులు ఇసుబ్ గారు, దమ్మాయి శ్రీను, దూడ వెంకటేష్, సర్పంచ్ సంతోష్ గౌడ్, ప్రభుదాసు, కాంతం చిన్నయ్య తిమ్ముల పోశెట్టి, వెల్మల్ ప్రభుదాస్, కొమిరె ముత్తెన్న, ఓంకార్ కాజవాలి, తోట మహేష్, తుక్కన్న, గాదె శ్రీన, కొండూరు సంజీవ్, ఎర్రోళ్ల రవి, మేరా శ్రీనివాస్, ఫిరోజ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎడ్డిగారి నిఖిల్, హరీష్, సాయి, మన్నె సాగర్, తమ్మల్లా దేవేందర్, తిమ్ముల శివ, ద్యావతి లింగం, మేకల గంగారెడ్డి, అరె రాజన్న, చింతకుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News