Bandi Sanjay: కాళేశ్వరం విచారణలో లోపాయికారి ఒప్పందం బట్టబయలు!

Bandi Sanjay: కాళేశ్వరం డిజైన్ లోపానికి కేసీఆరే ప్రధాన కారకుడని, రేవంత్ ప్రభుత్వం అవినీతిపరులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

Update: 2026-03-28 06:16 GMT

Bandi Sanjay: కాళేశ్వరం విచారణలో లోపాయికారి ఒప్పందం బట్టబయలు!

కరీంనగర్: కవిత కొత్త పార్టీ పెడుతుందనే దానిపై బండి సంజయ్ స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. స్వాగతిస్తాం. అయితే ప్రజల కోసం, పేదల కోసం ఏ పార్టీ పనిచేసినా ఆ పార్టీకే మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తే స్వాగతిస్తామని పలికారు.

కాళేశ్వరం డిజైన్ లోపంపై..

కాళేశ్వరం డిజైన్ లోపానికి ప్రధాన కారకులు కేసీఆరే. ఎందుకంటే ఆయన ఇంజనీర్ అవతారమెత్తారు. అనేక వేషాలు వేసి డిజైన్లు తయారు చేశారు. కాబట్టి దీనికి ప్రధాన బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం డిజైన్ కారకులను, అవీనీతిపరులను అరెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే కేసీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్కక్కయ్యారు. అందుకే అవినీతికి పాల్పడినా, డిజైన్ లోనే లోపముందని తేల్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఇదేమని అడిగితే కేంద్రంపై నెపం మోపి తప్పించుకోవాలని చూస్తున్నారు. సీబీఐకి పంపిన లేఖలోనూ పూర్తిస్థాయిలో వాస్తవాలు చెప్పలేదు.

డీలిమిటేషన్ తో దక్షిణాదిరాష్ట్రాలకు అన్యాయంపై..

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి జరిగే నష్టం ఏమిటో ఇప్పటి వరకు సీఎం చెప్పలేదు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం ఎట్లా జరుగుతుంది? 6 గ్యారంటీల అమలు చేయడం చేతగాక ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు ఈ డ్రామాలాడుతున్నరు. మహిళలకు నెలకు రూ.2500లు, వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి, రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, మహిళలకు తులం బంగారం, స్కూటీ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి. ముందు వాటి సంగతి తేల్చిన తరువాత మాట్లాడాలి. అంతే తప్ప వాటిని అమలు చేయలేక రాష్ట్రాన్ని అప్పులు పాల్జేసి ప్రజలను దారి మళ్లించేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రాభివ్రుద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్దంగా ఉంది. రాజకీయాలను పక్కనపెట్టి అభివ్రుద్ధిపైన, 6 గ్యారంటీల అమలుపైన ద్రుష్టి సారించాలని కోరుతున్నా.

Tags:    

Similar News