Telangana: తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక బిల్లుల జాతర!
Telangana: తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, వృద్ధుల ఆర్థిక భరోసా బిల్లుతో పాటు సింగరేణి వార్షిక నివేదికలపై చర్చ జరగనుంది.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక బిల్లుల జాతర!
Telangana Assembly: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి 103, 104వ వార్షిక రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ తర్వాత.. తెలంగాణ పంచాయతీ రాజ్-2026 అమెండ్మెంట్ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. వృద్ధ దంపతులకు ఆర్థిక భరోసా బిల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2026-27 బడ్జెట్ గ్రాంట్స్, ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్.
వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇవ్వనున్నారు. ఇక.. గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇస్తారు. ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.