Karimnagar: మున్సిపల్ కార్మికుల 'సిల్వర్ జూబ్లీ'.. కరపత్రం ఆవిష్కరణ!

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (CITU) స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 22, 23 తేదీల్లో నిర్వహించనున్న రజతోత్సవాల కరపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు ఆవిష్కరించారు.

Update: 2026-03-28 10:37 GMT

Karimnagar: మున్సిపల్ కార్మికుల 'సిల్వర్ జూబ్లీ'.. కరపత్రం ఆవిష్కరణ!

కరీంనగర్: తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కరీంనగర్ జిల్లా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరణ. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆవరణలో కరపత్రం ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ,

తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు)కరీంనగర్ మునిసిపాలిటి లో యూనియన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా "సిల్వర్ జూబ్లి" ఉత్సవాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో తేది 22, 23 ఏప్రిల్ 2026న నిర్వహిస్తున్నమని అన్నారు.

ఈ ఉత్సవాల జయప్రదానికి ఆర్థిక, హార్థిక, సహాయ, సహకారాలు అందించవల్సిందిగా కోరుతున్నాం. అనేక సంవత్సరాలుగా మునిసిపాలిటిల్లో సానిటేషన్, వాటర్ వర్క్ హరితహారం, ఎలక్ట్రిసిటి, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కార్మికులుగా పని చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడెందుకు వెనుకడుగు వేయకుండా పని చేస్తున్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో వెనకడుగు వేయలేదు..

కరోనాలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మునిసిపాలిటీల్లో విధులను నిర్వర్తించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం, అంటువ్యాధుల నివారణ ప్రజా సంబంధిత పనుల్లో మేము శ్రమిస్తూ ఉన్నాం అన్నారు. మున్సిపల్ కార్మికులం సమాజ శ్రేయస్సు కోసం ఎంతగానో కృషి చేస్తున్నప్పటికి మేము ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా యూనియన్ గా "తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ -సీఐటీయూ, సిల్వర్ జూబ్లి ఉత్సవాలు " కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. సిల్వర్ జూబ్లి ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక సహాయ సహకారాలు అందించి కార్యక్రమ జయప్రదానికి తమవంతు సహాయం చేయగలరని కోరారు.

ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి రవి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపల్లి పోచయ్య కరీంనగర్ కార్పొరేషన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మనుపాటి మల్లేశం దేవునూర్ శ్యాంసుందర్, మహిళా కమిటీ సభ్యులు పురుషోత్తం రాణి, గడ్డం రాజేశ్వరి,కుర రాజు, బరిగెల చంద్రయ్య బడికెల కృష్ణమూర్తి, పున్ని వెంకటేశం,ఓగుల బాలయ్య,తాండ్రల సురేష్ ఎడెల్లి సంపత్, సాగర్, అనిల్, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News