Armoor: వాహనదారులకు 'దూది' గండం!
Armoor: ఆర్మూర్ మండలంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ ఆధ్వర్యంలో రహదారుల వెంట ఉన్న అడవి దూది కాయలను తొలగించే కార్యక్రమాన్ని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
Armoor: వాహనదారులకు 'దూది' గండం!
Armoor: ఆర్మూర్ మండల న్యూస్: రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామం నుంచి దేగాం, మిర్ధపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్‌కు వెళ్లే రహదారుల వెంట ఉన్న అడవి దూది చెట్ల కాయలను తొలగించే కార్యక్రమాన్ని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్, ఉజ్వల ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మిన్ని శ్రీకాంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వేసవికాలంలో ఎండిపోయిన అడవి దూది కాయల నుంచి వచ్చే దూది రహదారులపై చెల్లాచెదురుగా వ్యాపించి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుందని తెలిపారు. ఈ దూది అకస్మాత్తుగా కంటిలో పడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే శ్వాసకోశ సమస్యలకు కూడా కారణమవుతుందని హెచ్చరించారు.
ప్రభుత్వం చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమం, రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు.ఉజ్వల ట్రస్ట్ అధ్యక్షుడు మిన్ని శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అడవి దూది చెట్ల వల్ల వాహనదారులకు ప్రమాదం కలగవచ్చని గుర్తించి, దూది గింజలు, కాయలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో దేగాం శ్రీకాంత్ గౌడ్, సురేష్, రాము మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.