Velerupadu: సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలు!

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చిగురుమామిడి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Update: 2026-03-30 10:27 GMT

Velerupadu: సర్వం కోల్పోయిన నాలుగు కుటుంబాలు!

Velerupadu: విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో నాలుగు పూరిల్లు దగ్ధమైన సంఘటన వేలేరుపాడు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. ఏలూరు జిల్లా వెలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో చండ్రుగొండ నర్సింహులు ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.

గ్రామస్థులు మంటలు అదుపు చేసే లోపే పక్కనే ఉన్న రవి, సింగబాబు, శ్రీను ఇండ్లకు మంటలు ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఇండ్లలోని ని సామాగ్రి, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. బంగారం సైతం కరిగిపోయింది. గ్రామస్థులు కృషి చేసి మంటల్ని అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబాలు మిర్చి రైతులు కావడంతో పంట అమ్మిన డబ్బులు కాలిపోవడంతో లబోధిభో అంటున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News