Bhimavaram: వ్యవసాయంతో పాటు పాడి ఉంటేనే ఆర్థిక అభివృద్ధి

Bhimavaram: భీమవరం మండలం చిన అమిరం గ్రామంలో ఏఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు.

Update: 2026-03-30 13:08 GMT

Bhimavaram: వ్యవసాయంతో పాటు పాడి ఉంటేనే ఆర్థిక అభివృద్ధి

భీమవరం: పాడి పంటలు అనేది ఎప్పటి నుండో రైతులతో మమేకమైనదని, పశువులకు సమయానికి వైద్య పరీక్షలు చేయించి మేలు పొందాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం చిన అమిరం గ్రామంలో భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి ప్రారంభించారు.

ఎమ్మెల్యే అంజిబాబు* మాట్లాడుతూ రైతుకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటేనే తగినంత ఆర్థిక అభివృద్ధి ఉంటుందని, ప్రతి ఇంటి ముందు ఆవు, గేదె ఏదో ఒకటి పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని సూచించారు.

రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పశు వైద్య శిబిరాలను పోషకలు సద్వినియోగం చేసుకోవాలని, పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

ఎఎంసి చైర్మన్ కలిదిండి సుజాత, వైస్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ పశువులకు సీజనల్‌ వ్యాధులు రాకుండా గ్రామాలలో ఎఎంసి ఆధ్వర్యంలో పశు వైద్యం అందించేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని, గ్రామాలలో జరిగే వైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియెగం చేసుకోవాలన్నారు. అనంతరం రైతులకు దాణాలను అందజేశారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, గ్రామ మాజీ సర్పంచ్, వివిధ కార్పోరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఏఎంసి డైరెక్టర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Tags:    

Similar News