Srikakulam: పోర్టుకు పోదాం రండి బహిరంగ సభలో మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

Srikakulam: నౌపడ మూలపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Update: 2026-03-30 12:40 GMT

Srikakulam: పోర్టుకు పోదాం రండి బహిరంగ సభలో మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

Srikakulam: నౌపడ మూలపేట జంక్షన్ దగ్గర ఏర్పాటుచేసిన "పోర్టుకు పోదాం రండి" బహిరంగ సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం కు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకాకుళాన్ని వెనకబడిన ప్రాంతంగనే చూస్తున్నారు తప్ప ఆ వెనక బండి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కూడా కూటమీ ప్రభుత్వానికి లేదని తెలిపారు, రెండేళ్లలో మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశారు కానీ ఇందులో వెయ్యి కోట్ల రూపాయలైనా శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారా అని ప్రశ్నించారు.

20 ఏళ్లు అధికారంలో ఉన్న టిడిపి జిల్లా కి ఏం చేసింది ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన మీరు చేసింది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి సీఎం గా పని చేశారు కానీ శ్రీకాకుళం కి ఎంతో మేలు చేశారు, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకి మేలు చేయడానికి మూలపేట పోర్టు నిర్మాణం కి శంకుస్థాపన చేశారు దాదాపు 70 శాతం పూర్తయిన పోర్టును మీరు మీరు పూర్తి చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు,

జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించడానికి పోర్టుకు శంకుస్థాపన చేశాడని రామ్మోహన్ నాయుడు అంటున్నారు కదా మరి మోసం చేయకుండా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏంటో రామ్మోహన్ నాయుడు చెప్పాలి అని ప్రశ్నించారు, ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన మీరు చేసింది ఏమీ లేదు.

కనీసం మాలాంటి వాళ్లు ప్రారంభించిన పనులను కూడా పూర్తి చేయలేదు,భోగాపురం ఎయిర్పోర్టుకు భూములు సేకరించి ప్రైవేటు వ్యక్తికి ఇస్తే వాళ్లు ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు ,దాన్ని నిర్మిస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పుకోవడం సిగ్గు చేయగా కనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు, మూలపేట పోర్ట్ విషయంలో కూడా ఇలాంటి మోసం చేస్తున్నారు, అని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సీట్లలోను టిడిపి అభ్యర్థులను తరిమికొట్టిన రోజే జిల్లా అభివృద్ధి చెందుతుంది అని రామ్మోహన్ నాయుడు దొంగ మాటలు చెప్పడం వలనే ఈ సభ పెట్టాం అని 

గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే వాళ్లు మనల్ని పొమ్మన్నారు రేపటి రోజున అమరావతి అభివృద్ధి అయితే అక్కడి నుంచి కూడా తరిమేస్తారు అందుకే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ పైనే దృష్టి పెట్టారు తెలిపారు, 

ఒరిస్సా ప్రభుత్వాన్ని ఒప్పించి నేరేడు బ్యారేజ్ పూర్తి చేయండి,మూలపేట పోర్టులు త్వరగా నిర్మాణం చేయండి ,ఇన్ని రోజులు ఎలా శ్రీకాకుళం జిల్లా వాసులు చూస్తూ కూర్చోవాలి , శ్రీకాకుళం జిల్లాలో నదుల్లో తాగునీరు పూర్తిగా కలుషితమయ్యాయి, జిల్లాలో ఇసుక, ఊక, పేడ అన్ని టిడిపి ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు, దీనిపై ప్రశ్నిస్తే కలెక్టర్ ఎస్పీ నోరు మెదపడం లేదు, ఒక్క అధికారైన రాష్ట్రంలో స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితి ఉందా చంద్రబాబు? అని ఎద్దేవా చేశారు, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని చూసి ఎలా పరిపాలన చేయాలో నేర్చుకోండి

చంద్రబాబు ముగ్గురిని కనాలి అంటున్నాడు కదా మూడో బిడ్డని కంటే పాతికవేలు ఇస్తాడంట అంటే ఒక బిడ్డ విలువ పాతిక వేలుతో సమానమా, మా ఊర్లో మేకపిల్ల విలువ కూడా పార్టీకి వేలు పైనే ఉంటుంది. అని ఎద్దేవా చేశారు, ఊ అంటే అమరావతి అంటున్నారు రాష్ట్ర సంపదలో మిగిలిన ప్రాంతాలకు భాగస్వామ్యం లేదా? మనం తిరగబడతామనే భయం ఉంటే తప్ప శ్రీకాకుళం జిల్లా పైన చంద్రబాబు దృష్టి పెట్టరు ,

రైతులకు యూరియా అందించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇప్పటి ప్రభుత్వం ఉంది రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ద్వారా కూడా ఇవ్వలేకపోతున్నారు , మొక్కజొన్న క్వింటా 2400 రూపాయల మద్దతు ధర ఉంటే 1600 రూపాయలు కూడా రైతు అమ్ముకోలేకపోతున్నారు మనమంతా ప్రతిఘటించకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం మనమంతా ఉద్యమానికి సిద్ధం కావాలి అని ఈ సందర్భంగా తెలిపారు,

Tags:    

Similar News