Mamuduru: విద్యార్థులకు అండగా ఉండటమే నిజమైన వేడుక
Mamuduru: నెల్లూరు జిల్లా మామూడూరు హైస్కూల్‌లో గిరినాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, ప్యాడ్‌లు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.
Mamuduru: విద్యార్థులకు అండగా ఉండటమే నిజమైన వేడుక
Mamuduru: తాళ్లూరి గిరినాయుడు గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్యా సామాగ్రి ని సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరతయ్య మరియు చేజర్ల మండల టిడిపి కోశాధికారి గుత్తా శ్రీధర్ నాయుడు చేజర్ల మండలం మామూడూరు లోని హైస్కూల్‌లో విద్యార్థులకు పెన్,ప్యాడ్,పెన్సిల్, వంటి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ,ప్రతి సంవత్సరం గిరినాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవసరమైన విద్యా వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గిరినాయుడు ఎన్నో సేవలు చేసి ఆదర్శప్రాయ నాయకుడిగా నిలిచారని కొనియాడారు.
విద్యార్థులు విద్యలో ముందుకు సాగాలని,మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ బిల్లు పాటి వెంకటేశ్వర్లు,హైస్కూలు విద్యా కమిటీ చైర్మన్ అల్లంపాటి అనిత, ఎంపీపీ విద్యా కమిటీ చైర్మన్ ఎస్.కె రసూల్, అంగన్వాడీ టీచర్స్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.