Palakonda: చాకిరీ మాది.. జీతాలు వేరొకరిదా? వేతన బకాయిలపై వర్కర్ల పోరు

Palakonda: పాలకొండ మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

Update: 2026-03-30 12:58 GMT

Palakonda: చాకిరీ మాది.. జీతాలు వేరొకరిదా? వేతన బకాయిలపై వర్కర్ల పోరు

Palakonda: పాలకొండ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) పాలకొండ మున్సిపల్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం పాలకొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట మధ్యాహ్నం మస్తరు సమయంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, పాలకొండ మున్సిపల్ ఫెడరేషన్ కార్యదర్శి సిహెచ్ సంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలో మునిసిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు 60 సంవత్సరాలకు రిటైర్ అయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, చనిపోయిన కార్మికుని కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంచాలని, చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని,

పెరిగిన ధరలకు అనుగుణంగా పిఆర్సి, వేతనాలు పెంచాలని, ప్రభుత్వమే నేరుగా కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చట్టబద్ధత చేయాలని, పట్టణ విస్తరణనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి నాలుగు నెలలు పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న వారికి మూడు నెలలు వేతన బకాయిలు తక్షణమే చెల్లింపుకు చర్యలు చేపట్టాలని ప్రతినెల 5వ తేదీ లోపే వేతనంలో చెల్లించాలని పనిముట్లు స్థానికంగా ఉన్న తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతల్ రఘు కార్తీక్ భాస్కరరావు వి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News