Vijayawada: కాపాడండి మహా ప్రభో.. ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేసిన గిరిజనులు

Vijayawada: విజయవాడలోని ఎస్టీ కమిషన్ కార్యాలయంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఫిర్యాదు చేశారు.

Update: 2026-03-30 12:47 GMT

Vijayawada: కాపాడండి మహా ప్రభో.. ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేసిన గిరిజనులు

Vijayawada: ఏడు కోట్ల ట్రైకారు నిధులు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా. హైఫర్ ఇంటర్నేషనల్ అనే స్వచ్చంద సంస్థకు కట్టబెట్టి, నిధులు దుర్వినియోగం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై. సమగ్రవిచారణ జరిపి, బాద్యులైన గిరిజన సంక్షేమ శాఖా ఉన్నతాధికారులపై చర్యలుతీసు కోవాలని కోరు తూ. ఈ రోజు యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ లోని, ST కమిషన్ కార్యాలయంలో. ST కమిషన్ రాష్ట్ర కార్యదర్శి రామ శేషుని కలిసి ఫిర్యాదుచేశారు.

ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు, KC పెంచలయ్య యానాది మాట్లాడుతూ. రాష్ట్రాంలోని 6 ITDA ల పరిధిలో. 4593 మంది లబ్ధిదారులకు దేశీబ్యాక్ యార్డ్, పౌల్ట్రీప్రాజెక్ట్ ను 7.5 కోట్లతో. ఎలాంటి ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్స్ లేకుండా. ఏకపక్షంగా హైఫర్ ఇంటర్నేషనల్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు?

ITDA ల ద్వారా జరగాల్సిన లబ్ధిదారుల ఎంపిక, ITDA ల ప్రమే యంలేకుండానే, గ్రామసభలు నిర్వహించకుండానే, నోటిఫికేషన్ లేకుండానే. లబ్ధిదారుల ఎంపిక రహస్యంగా నిర్వ హించాల్సిన అవసరం ఏంటని ప్ర శ్నించారు? ఆ ప్రాజెక్ట్ కింద పనిచేసే కోడి పిల్లలు, దాణా,రవాణా,టీకా కొను గోళ్లకు, ఈ ప్రోక్యూర్ మెంట్ ద్వారా జిల్లా పర్చేసింగ్ కమిటీ ఆధ్వర్యంలో. టెండర్లు నిర్వహించకుండా హైఫర్ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పినవారినే ఎలా ఎంపికచేస్తారు అని విమర్శించారు ?

గిరిజనులకు ప్రత్యక్షంగా ఇవ్వాల్సిన ట్రైకారు రుణాలు, ఛారిటబుల్ ట్రస్ట్ లు, మరియు స్వచ్చంద సంస్థలకు అప్పగించడం అంటే గిరిజనులకు ఆశచూపి వారి పొట్టకొట్టి నిధులు కాజేయడమే కదా అని ప్రశ్నించారు?

అన్ని ITDA పరిధిలోని ఈ పథకాన్ని నిలుపుదల చేసి, బాధ్యులైన గిరిజన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు కేసి పెంచలయ్య యానాది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తూరు శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, గుంటూరు జిల్లా చైర్మన్ పొట్లూరు వేంకటేశ్వర్లు, మహిళా నాయకు రాలు చెలంచెర్ల తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News